సమాజంలో శాంతిభద్రతలను కాపాడేది పోలీసు వ్యవస్థ,
సీఐ వెంకట్ రెడ్డి,సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,
జనం న్యూస్,ఏప్రిల్ 13,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ స్థానిక రైతు వేదికలో పోలీసు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఐ వెంకట్ రెడ్డి,ఎస్ఐ దుర్గారెడ్డి,హాజరైయరు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు తరచూ వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు అని అన్నారు.వాటిలో ముఖ్యమైనవి.ట్రాఫిక్ నిబంధనలు,భద్రత, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు, అతివేగం,ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన,పౌరహక్కులు,ప్రజలకు చట్టపరమైన పౌరహక్కుల అవగాహన కల్పించారు.ఎస్ఐ మాట్లాడుతూ పౌర హక్కులను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.సైబర్ నేరాలు,ఆన్‌లైన్ మోసాలు,వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడంతో జరిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. సర్పంచ్ మాట్లాడుతూ సామాజిక అంశాలు, మహిళా భద్రత,బాల్య వివాహాల నిరోధం,డ్రగ్స్ రహిత సమాజం వంటి అంశాలపై సదస్సులు నిర్వహించడం.గ్రామ పట్టణ భద్రత, గ్రామాల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఉప సర్పంచ్ సమీర్, మాట్లాడుతూ పోలీసులు క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామాల్లో, సదస్సులు,ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉంటారని అన్నారు.పోలీసుల అవగాహన అనేది సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థ యొక్క విధులు, బాధ్యతలను అర్థం చేసుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ,పోలీసులు సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, నేరాలను అరికట్టడానికి,పౌరుల భద్రతకై,24/7 పని చేస్తారు అని అన్నారు. కార్యదర్శి జ్ఞానదేవ్, మాట్లాడుతూ పోలీసులు నిరంతరం విధి నిర్వహణలో పలు రకాల సవాళ్లను ఎదుర్కొంటూ పోలీసు అధికారులు క్లిష్ట పరిస్థితుల్లో,ప్రాణాలకు తెగించి బాధ్యతలను నిర్వహిస్తారు అని అన్నారు.విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సవాళ్లు చాలా తీవ్రంగా ఉంటాయి అని అన్నారు.సామాజిక సేవ పోలీసులు కేవలం నేరాలను అదుపు చేయడమే కాకుండా, విపత్తుల సమయంలో, ప్రజలకు సహాయం అందించడంలో ముందుంటారు అని అన్నారు.వారి త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.నేరాలు జరిగినప్పుడు వాటిని దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని,చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు.
ప్రజా-పోలీసు ప్రజలకు పోలీసుల పట్ల, పోలీసులకు ప్రజల పట్ల అవగాహన ఉండటం వల్ల నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు అని అన్నారు.పోలీసు వ్యవస్థ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల చట్టాన్ని గౌరవించడం,నేర రహిత సమాజ నిర్మాణం కోసం సహకరించడం మనందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘ నాయకులు, వ్యవసాయదారులు, సామాన్య ప్రజలు, పాల్గొన్నారు.


