Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 13,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా

యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కడపాలెం గ్రామంలో ఇటీవలె అచ్యుతాపురం లోగల కస్తూరిబా బాలికల హాస్టల్‌లో పాము కుట్టిన ఘటనలో మృతి చెందిన ఎం. నవ్య కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరామర్శించారు.ఎమ్మెల్యే విజయ్ కుమార్ నవ్య కుటుంబ సభ్యుల వద్ద నుంచి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని దైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.