Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 13: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగామంగళ వారం ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏ వై ఎస్ మండల అధ్యక్షులు చిట్యాల రాజేష్ తెలిపారు.
ఈ ర్యాలీ ఉదయం 6:30 గంటలకు తోర్తి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమవుతుంది. అనంతరం బట్టపూర్, తడపాకల్, దొంచంద, గుమ్మిర్యాల్, నగేంద్ర నగర్, తాళ్ల రాంపూర్ గ్రామాల మీదుగా సాగి ఏర్గట్లలోముగింపు సభ నిర్వహించబడుతుంది.ఈ సందర్భంగా తడపాకల్ మరియు దొంచంద గ్రామాల్లో అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.