Listen to this article

జనం న్యూస్ 14 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ పద్మ – రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు, ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ దార్శనికుడు సంఘ సంస్కర్త విధ్యా ప్రదాత అసమానతలు అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగరేసి, బోధించు, సమీకరించు, పోరాడు అంటూ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడు అనగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ “విద్య పొందండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి” అనే ఆయన సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.