Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు స్థానిక అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు ఉదయం మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్జుడు, రాజ్యాంగ ప్రదాత, ప్రగాఢ దేశభక్తుడైన అంబేద్కర్ ను కులం ఆధారిత రిజర్వేషన్ అంశానికి పరిమిత చేయడం శోచ నీయమని నాగ జగదీష్ అన్నారు. అంబేద్కర్ మొదటి నుంచి మహిళా సాధికారత, సమాన హక్కులు, రాజకీయ, ఆర్థిక రాజకీయ సమతుల్యం కోసం పోరాడారని, అందులో భాగంగానే నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ బిల్లు ఇచ్చి వారికి సముత స్థానం కల్పిస్తున్నారని భారత్ బలంగా, ఐక్యంగా ఉండాలంటే పోరాడు తెచ్చుకున్న స్వతంత్రం సురక్షితంగా ఉండాలంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని, అందుకోసం ఫెడరేషన్ కాకుండా యూనియన్ ఆఫ్ స్టేట్ గా అభివర్ణించారని, ఐక్యత కంటే ఏకతకు ప్రాధాన్యత ఇచ్చారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ గోవాడ రాజు మర్ర జోగారావు మల్ల గణేష్ పోలిమేర నాయుడు కాండ్రేగుల వెంకట సూరి గుర్రాల వాసు కొమ్మోజు రామకృష్ణ సాలాపు నాయుడు బుద్ధ విశ్వనాథం బొడ్డేడ నూకరాజు కొణతాల బాబురావు కొణతాల శ్రీనివాసరావు కొణతాల నూకరాజు తొత్తర అప్పారావు వాడాల సంజీవరావు కాండ్రేగుల రవీంద్ర సారిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.//