Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల రైతు లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పథకాలు సరైన లబ్ధిదారులను గుర్తించి పథకాలు వర్తింపచేయటకు కొత్తగా భూ ఆధార్ ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం తీసుకురావడం జరిగినది. ఈ భూ ఆధార్ ఉన్నవాళ్ళకి మాత్రమే పి ఎం కిసాన్ వంటి పథకాలు వర్తింప చేస్తారు కావునా,ప్రతి భూమి ఉన్న రైతు క్రింది సూచించిన పత్రాలు తో మీ రైతు సేవా కేంద్రం ను ఫిబ్రవరి 25 తేదీలోగా నమోదు చేసుకోవాలి. పట్టాదారు పాసుపుస్తకం/ 1 బి ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ లింక్ చేయబడ్డ మొబైల్ నెంబర్ ప్రతి రైతు అశ్రద్ధ చేయకుండా భూ ఆధార్ పొందవలసింద గా కోరు చున్నాం . ఎం ఏ ఓ కే ప్రవీణ్ కుమార్ కాట్రేనికోన