Listen to this article

జనంన్యూస్. 14.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, నగరంలో పులాంగ్ చౌరస్తా నందు,ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి TNGO పక్షాన పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి, స్మరించుకున్న ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ , టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశం నందు కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్ మాట్లాడుతూ..Dr. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు ముఖ్య సూత్రాలే మన దేశ సర్వతోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని,… అన్ని రంగాలలో సమానత్వాన్ని పాటించినప్పుడే ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అని, టీఎన్జీవో ఆధ్వర్యంలో కుల,మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతూ.. ఆ మహానుభావునికి ఆదర్శంగా ఉంటు బాబాసాహెబ్ వారసులుగా కొనసాగుతూ వారి ఆశయ సిద్ధికి పాటుపడతామని సగర్వంగా తెలియజేస్తూ, మరో మారు ఉద్యోగులకు మరియు జిల్లా ప్రజలందరికీ బాబాసాహెబ్ జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, అనంతరం టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు,బాబా సాహెబ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి, ఘనమైన నివాళులు అర్పించి స్మరించుకున్న ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ బృందం…
కార్యక్రమానికి టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం , రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు నిరంజన్ గౌడ్, స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.