జుక్కల్ ఏప్రిల్ 14 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీలో మంగళవారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 వ జయంతిని పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ సాయి గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ చేసిన త్యాగం కృషి వల్లే నేడు మనకు రాజ్యాంగం ద్వారా హక్కులు లభించాయని పేర్కొన్నారు అంబేద్కర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని సమాజ సేవకు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*


