సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్
జహీరాబాద్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పద్మశాలి సంఘం ఘనంగా నివాళులు అర్పించింది. మంగళవారం స్థానిక మెయిన్ రోడ్డు లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు సమర్పించి నివాళులు అందజేశారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్, కార్యవర్గ సభ్యులు సోమ చంద్రశేఖర్, పగిడిమర్రి రాములు, శివరాం రమేశ్, కొండా శివరాజ్,దార మధు (లక్కీ ), గద్దె వెంకటేశం, ఎన్నం రఘు,పెగడ శ్రీనివాస్, సగ్గం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


