Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 235వ జయంతి సందర్భంగా ఏర్గట్లమండలంలోని అన్ని గ్రామాల్లో బహుజన నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.మండల అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో తోర్తి గ్రామం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ, మండల కేంద్రం ఏర్గట్లలో ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోటగిరి రామా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రతో పాటు ఇతర మహనీయుల చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అలా చేస్తేనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా కో-కన్వీనర్ దిబ్బ సుదర్శన్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు చిట్యాల రాజు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ మండల అధ్యక్షుడు జూంగల గణేష్, బీసీ నాయకుడు తడపాకల్ రామన్న, అంబేద్కర్ కమిటీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దయానంద్ తదితరులు ప్రసంగించారు.అలాగే అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు గన్నారపు రాజేశ్వర్, ఆనంద్, అజీమ్, కుండ శేఖర్, నరసయ్య, అమృత్, పౌలింగ్, నరేందర్, జితేందర్, గణేష్, దిలీప్, సునీల్, గద్దల సతీష్, స్వాతి, అనిల్, చక్రి, రామ్, నలిన్, శోభన్ తదితరులు మరియు భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.