Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 15: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల

మండలకేంద్రంలోpపీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పాఠశాలలో నిర్వహించిన “ఇంటరాక్షన్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ విత్ రోల్ మోడల్” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని బుధవారం పాల్గొని ప్రసంగించారు.తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విషయాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్న ఆమె, విద్యార్థులంతా ఉన్నత చదువులు అభ్యసించాలని పిలుపునిచ్చారు. ఏ పని అయినా దృఢనిశ్చయంతో కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. ముఖ్యంగా బాలికలు తమ కాళ్ల మీద తామునిలబడాలని సూచించారు.సమాజంలో మహిళలు అనేకసమస్యలను ఎదుర్కొంటున్నారని, పోలీస్ స్టేషన్లకు ఇలాంటి కేసులు తరచుగా వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు స్వతంత్రంగా జీవించగలిగితే ఈ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ఉద్యోగం లేదా ఏదైనా నైపుణ్యం సాధించడం ద్వారా స్వయంసమృద్ధిసాధ్యమవుతుందనివివరించారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, ప్రతి మనిషికి లక్ష్యం ఉండాలని, కానీ అది సరిదారిలో నడిపించే విధంగా ఉండాలని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం గొప్పతనం అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని పి. జ్యోతి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్, సమిత, ఎస్. శ్రీనివాస్, విజయ్, రాజేందర్, రాజనర్సయ్య, గంగాధర్, కె. శ్రీనివాస్, జ్యోతి, ట్వింకిల్ కుమార్, నరేష్, గంగమోహన్, కోమలి, రిషిక, కృష్ణవేణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.