Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026

జహీరాబాద్ పట్టణంలో గాంధీనగర్ బేడ బుడజంగం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, సమసమాజ నిర్మాణానికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటు బేడ బుడగ జంగం ఆధ్వర్యంలో విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బేడ బుడజంగం సంగారెడ్డి జిల్లా సలహాదారులు మాదినం అంజయ్య, బైలపటి రాములు, ఆనగుంట మాజీ సర్పంచ్ కుమారి జగదీశ్వర్ సామాజిక న్యాయం, సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన అద్వితీయ పాత్రను, దళిత, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.ఈ సందర్భంగా, అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతిజ్ఞ చేయాలని, సమానత్వాన్ని పాటిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడమంచి హనుమంతు,హానరసి బేతాల, మాదినం దశరథ్ ,మాదినం దుర్గాప్రసాద్, మాదినం శివప్రసాద్, కడ మంచి శివకుమార్,బలపట్టి లక్ష్మయ్య, పేర్ల దశరథ్, పేర్ల నాగేష్, ప్యార్ల గోపాల్ ,ఈప్తి చంద్రశేఖర్,మోతే బసయ్య,ప్యార్ల పెంటయ్య,సాయిలు, ఉదయ్ కుమార్,తదితరులు పాల్గొన్నాడం జరిగింది.