Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ప్రతిపేదవాడికి కూడు…బట్ట నీడ.. అవసరం అని గుర్తించి ఆనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలు చాలా గొప్పవని ముమ్మిడివరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కాట్రేనికోనలో అన్న క్యాంటీన్ ప్రారంభ ఉత్సవానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటరీ సభ్యులు గంటి హరీష్ మాధుర్ తో కలిసి61 లక్ష ల వ్యయంతో నిర్మించిన అన్న కాంటీన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 260 అన్నా క్యాంటీన్ల ద్వారా కొన్ని కోట్ల మంది పేదలు ప్రజల ఆకలి తీరుస్తున్నామని అన్నారు.నాణ్యతతో కూడిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ ద్వారా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడుతూ పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్నకూటమి ప్రభుత్వంనింపుతుందన్నారు. అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ మాట్లాడుతూ” పేదల పాలిట పెన్నిధి…కూటమి ప్రభుత్వం అని అన్నారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నిర్వర్తిస్తుందని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ భవనాలను శిధిలా వ్యవస్థలకు తీసుకురావడం జరిగిందన్నారు. పేదోడి కల… కలగా మిగిలిపోకుండా ఉండకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం పేదవాడు గుండెల్లో ధైర్యం నింపుతుందని గంటి హరీష్ మధుర్ అన్నారు.ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు.. కట్టు కోడానికి బట్టలు.. తినడానికి తిండి.. ఆనాడుస్వర్గీయ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన అన్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి మారుపేరు స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయోగి అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దాట్ల బుచ్చిబాబు అని అన్నారు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు రెండు అన్న క్యాంటీన్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు కృషి అని ఆయన తెలిపారు. ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేసిన పిఎస్ఎన్ (విలేకర్ రాజు) సేవలు ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.తొలిత అన్నా క్యాంటీన్ ఆవరణలో నిర్మించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు , స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయోగి నిలువెత్తు విగ్రహాలకు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు 5రూపాయలు భోజనం అందించి స్థానిక శాసనసభ్యులు, ఎంపీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆ పథకం ద్వారా అందించే భోజనం ఒక నాణ్యత పరిశుభ్రత రుచి వాళ్లతో పాటు తిని పరిశీలించడం జరిగింది.ఈ పథకం ద్వారా భోజనం తిన్న పేద ప్రజలను నాణ్యత గురించి రుచి శుభ్రత అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసి కోవాలని సూచించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వికలాంగుడు ని గుర్తించి అతని సమస్యను స్థానిక శాసనసభ్యులకు, ఎంపీ దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కృషి చేసిన జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగిడి నాగేశ్వరావు, తాడి నరసింహారావు. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఓగురి భాగ్యశ్రీ, డైరెక్టర్ మట్ట సూరిబాబు, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ,ఆకాశం శ్రీనివాస్, మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, కాండ్రేగుల సత్యప్రసాద్, మట్ట రమేష్, చీకురుమిల్లి చక్రధర్ నడింపల్లి సుబ్బరాజు, విత్తనాల బుజ్జి, బండారు ఏసు వంగ దుర్గ బాబు , నూక ల దుర్గ,రంబాల చౌదరిబాబు,మాజీ సర్పంచ్ . గిడ్డి రత్నశ్రీ , వాసంశెట్టి రాజేశ్వరరావు, దొమ్మేటి పల్లవి,నల్ల రామకృష్ణ తదితరు పాల్గొన్నారు