జనం న్యూస్ ఏప్రిల్ 15:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని తోర్తి, నాగేంద్ర నగర్, గుమ్మిర్యాల్, ర్యాల గ్రామాల్లో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తోర్తి సర్పంచ్ కౌడ భూమేశ్వర్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ ఎఫ్‌సీఐ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. దళారులకు తక్కువ ధరలకు అమ్మి నష్టపోకూడదని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ‘ఏ’ గ్రేడ్‌కు క్వింటాల్‌కు ₹2389, ‘బి’ గ్రేడ్‌కు ₹2369 చెల్లిస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


