జనం న్యూస్ ఏప్రిల్ 16: నిజామాబాద్ జిల్లావేల్పూర్ మండలం
సాయిబాబా బాటలో నడుస్తూ “ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం సేవలో శ్రేష్ఠం” అనే సందేశంతో ప్రతి గురువారం వేల్పూర్ సాయిబాబా దేవాలయంలో అన్నదానం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వేల్పూరుకు చెందిన నీరడి ఆకాంక్ష మహంత్ దంపతులు, నిజామాబాద్‌కు చెందిన అఖిలేశ్వర్ దంపతులు, బాచన్పల్లికి చెందిన బొందుగుల జయశ్రీ–వెంకటేశ్వర్లు దంపతులు మహా అన్నదానం నిర్వహించారు. అన్నదాతలను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుడు అనురాగ్ పాండే శాలువాలతో సత్కరించి, గోవిందగిరి స్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ధ్యాన మందిరంలో భజనలు నిర్వహించగా, సాయి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. “ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి” నినాదాలతో ఆలయం మార్మోగింది.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇరుపాజి దామోదర్ గౌడ్, రాజారపు బాల్ రాజ్ (సాయిరాం బాలరాజ్), అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, దమ్మాయి లక్ష్మి, కుంట సువర్ణ సాయరెడ్డి, గడ్డం మల్లేష్, మెండే పద్మిని–మహేందర్ దంపతులు, బోనగిరి గంగాధర్, ఆంధ్ర స్వామి, కొండ అశోక్ గౌడ్, కోరెం నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



