జనం న్యూస్: 16 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్
సిద్ధిపేట బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ హిమబిందు మరియు అధ్యాపకులు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో జరిగింది.


