నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కాలేజీలో అందుబాటులోకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కోర్సులు
జనం న్యూస్- ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్-
పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక సదుపాయాలతో విద్యా బోధన ఉంటుందని, పాలిటెక్నిక్ కోర్సులతో విద్యార్థులకు విస్తృత కెరీర్ అవకాశాలు ఉంటాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోర్సులు సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ తో పాటుగా ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. పాలిటెక్నిక్ కాలేజీ కోర్సులకు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న లేదా ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 20, దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలు ఇతరులకు 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని, ఏప్రిల్ 21 న 100 రూపాయలు అదనపు రుసుముతో, ఏప్రిల్ 22వ తారీఖున 300 రూపాయలు అదనపు రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష మే 13 న ఉంటుందని, పరీక్షా విధానం పదవ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటుందని అన్నారు. పాలిటెక్నిక్ కోర్స్ చదివిన విద్యార్థులకు రైల్వే, ఎయిర్ ఫోర్స్, సింగరేణి, బీడీఎల్, ఈసీఐఎల్, ఆర్టీసీ, వంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని , నాగార్జునసాగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రశాంత వాతావరణంలో అనుభవం కలిగిన బోధనా సిబ్బంది తో ల్యాబ్స్ మరియు ప్రాక్టికల్ ట్రైనింగ్ తో పాటు బాలురకు హాస్టల్ సౌకర్యం కలదని, స్వచ్ఛమైన తాగునీరు విశాలమైన క్యాంపస్ క్రీడామైదానం అందుబాటులో ఉన్నాయని కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ ఐలయ్య కోరారు.


