అస్వస్థతకు గురైన సి ఐ భారీ మొత్తం లో నగదు లభ్యం
బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్
అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ ఇంట్లో సి ఐ అద్దెకు ఉంటున్నారు. ఆయన నివాసంలోనే ACB సోదాలు చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ రేంజ్ ACB అధికారులు శుక్రవారం ఉదయం సిఐ నివాసంలో తనిఖీలు మొదలుపెట్టారు. తనిఖీలు జరుగుతుండగా సిఐ సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులను రప్పించి ఆయనకు చికిత్స అందిస్తూనే సోదాలు కొనసాగిస్తున్నారు.పోలీసుల బందోబస్తు మధ్య తనిఖీలు జరుగుతున్నాయి.సి ఐ ఇంటి వద్ద పోలీస్ బందోబస్త్ దృశ్యం ముఖ్యాంశం: ఎక్సైజ్ సిఐ ఇంటిపై ACB దాడులు చేయడం, ఆ టైమ్లో ఆయన అస్వస్థతకు గురికావడం వల్ల ఈ వార్త స్థానికంగా సంచలనం అయ్యింది. తనిఖీల్లో ఏం దొరికింది అనేది ఇంకా తెలియదు. ఐతే భారీ మొత్తం లోనే నగదు లభించిందని సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.




