జనం న్యూస్ 17 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అధ్యక్షు తరహా పాలనపై కేంద్రం ఆలోచన ఆలోచనను విరమించుకోవాలి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దెపాగ మణి కుమార్ జోగులాంబ గద్వాల్ జిల్లా ::ఎర్రవల్లి ::- కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ పేరుతో కుట్రకు పాల్పడుతుందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దెపాగ మణి కుమార్ అన్నారు. బీజేపీకి పట్టున్న ప్రాంతాలను పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలుగా ప్రతిపాదించి శాశ్వతంగా దేశానీ యేలాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డి లిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతుందన్నారు. గురువారం ఎర్రవల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ధర్మవరం రాముడు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఓవైపు 33% మహిళలకు రిజర్వేషన్లు అంటూ.. మరోవైపు డి లిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వము కుట్రకు పాల్పడుతుందన్నారు. దేశ అధ్యక్ష తరహా పాలనను చేయాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన స్పష్టంగా కనబడుతుందన్నారు. డి లిమిటేషన్ తర్వాత భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వము ఉన్నట్లు ఆయన అన్నారు. డి లిమిటేషన్ దేశ సమైక్య వ్యవస్థకు విరుద్ధమని ఈ సందర్భంగా ఆయన విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన భారత రాజ్యానికి విరుద్ధంగా ఉందని.. దీనిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు, అలంపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శాంతి రాజు, ఇటిక్యాల మండలం అధ్యక్షుడు టి జీవన్, సీనియర్ నాయకులు బొజ్జన్న,బుజ్జన్న కుర్షిడ్, గుమ్మగోవర్ధన్, నరసింహ ఇతరులు పాల్గొన్నారు.


