సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 17:
జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న ఆదివారం ఉదయం 6 గంటలకు పట్టణంలోని అదర్శ్ నగర్ కాలనీలోని ఉద్యాన వనంలో 203వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హరేకృష్ణ మహామంత్ర జపం, ప్రభుపాదుల ప్రార్థన, కీర్తనలతో శోభాయమనంగా కొనసాగనుందని తెలిపారు. తదనంతరం గోల్డెన్ టెంపుల్ హైదరాబాద్ బాధ్యుల ద్వారా సత్సంగ ప్రవచనం, నరసింహ ఆరతి, ప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. అదే విధంగా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలోనూ ఆ గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7గంటలకు 168వ పల్లె సంకీర్తన జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామం లోని ఆంజనేయ స్వామి మందిరం నుండి గ్రామమంతా తిరుగుతూ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని వివరించారు.


