జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డిఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర శుక్రవారం తనిఖీ చేశారు. ఓ ఆర్ ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పీహెచ్ సి ఓపి రిజస్టర్నీ తనిఖీ చేసి, మందులు పంపిణినీ పరిశీలించారు వైద్య సేవలు ఏవిధంగా జరుగుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీ పెరగాలని సూచించారు.యన్ సి డి సి డి, క్యాన్సర్ కేసుల రిజిస్టర్ వెరిఫై చేశారు. హెచ్ పి వి వ్యాక్సిన్ రిజిస్టర్ పరిశీలించారు.196 మంది బాలికలకు సదరు వ్యాక్సిన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ ల్యాబ్ పరిశీలించి పనులు ఎంతవరకు జరిగాయని కాంట్రాక్టర్ బాబిని అడిగి తెలుసుకున్నారు. 62 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సెంట్రల్ లాబ్ ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డాక్టర్ ఎం లిఖిత మేడం, కె
శేషుబాబు సిహెచ్ఓ ,సూపర్వైజర్లు ఆసుపత్రి, సిబ్బంది తదితరులు ఉన్నారు


