మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో చేరిక
జనం న్యూస్ ఏప్రిల్ 17 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (హుజురాబాద్ నవ్య చికెన్ సెంటర్ యజమాని) పెండ్యాల తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో జగన్నాథపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ముష్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెండ్యాల తిరుపతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామినై పార్టీ విధి విధానాలకు కట్టుబడి పని చేస్తానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రజా పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ కు మద్దతుగా ప్రజలు పార్టీలోకి రావడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ లు ఆరపెల్లి సమ్మయ్య, ఆరపెల్లి రమేష్, వార్డు మెంబర్లు ఆరపెల్లి సమ్మయ్య, ఆరపెల్లి చిరంజీవి, పెండ్యాల కుమారస్వామి, , సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబర్లు పెండ్యాల భాస్కర్,బండి కుమారస్వామి, పెండ్యాల సామెల్, పంజాల చేటారి గౌడ్, నాయకులు కేంసారపు సంపత్, పంజాల స్వామి, యజన నాయకులు పెండ్యాల రాజేష్, మాటూరి శ్రీనివాస్, గుండాల మధు, గూటం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


