Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), బిచ్కుందలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్ అధ్యక్షత వహించగా, మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ విద్యా ప్రస్థానంలో పొందిన అనుభవాలను, గురువులతో గడిపిన మధుర జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అధ్యక్ష ప్రసంగంలో ప్రిన్సిపాల్ కె. అశోక్ విద్యార్థులు డిగ్రీ అనంతరం ఉన్నత విద్యను అభ్యసిస్తూ, తమ తల్లిదండ్రులకు మరియు కళాశాలకు కీర్తి తేవాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి శ్రీమతి సీమ షెట్కర్ మాట్లాడుతూ, కళాశాల అధ్యాపకులు అందిస్తున్న నాణ్యమైన విద్యను అభినందించి, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు విజయభాస్కర్ రెడ్డి విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని వాటిని విద్య ద్వారా సాధించుకోవాలని కోరారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, స్థానిక నాయకులు సాహిల్ షెట్కర్, శెట్లూరు సర్పంచ్ కాళోజి విఠల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.