Listen to this article

జనం న్యూస్ : 17 ఏప్రిల్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

సిద్దిపేటకు చెందిన పద్యకవి కాల్వ రాజయ్య గారి శిష్యురాలు పర్సకుర్మ రిషిక రాసిన కృషి శతకం పుస్తకావిష్కరణ సోమవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట, రాజన్న సిరిసిల్లలో కలదని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. అందుకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ సిద్దిపేటలోని మహాత్మాగాంధీ పార్క్ వద్ద జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి కసిరెడ్డి వెంకటరెడ్డి, సంటి గంగారం, డాక్టర్ బొల్గం జగన్మోహన్ రెడ్డి, పిట్ల ఎల్లయ్య, చీకోటి సుభద్ర, నర్సింలు, కృష్ణహరి, నిమ్మ రాజిరెడ్డి, గరిపల్లి అశోక్, వరుకోలు లక్ష్మయ్య, వాసరవేణి పర్శరాములు, ముత్యాల నరేందర్ తదితరులు హాజరవుతారన్నారు. ఎన్నవెళ్ళి రాజమోళి, కాల్వ రాజయ్య, పెందోట వెంకటేశ్వర్లు, బస్వ రాజ్ కుమార్, గంగాపురం శ్రీనివాస్, మల్లముల కనకయ్య తదితరులు కరపత్రం ఆవిష్కరణ చేసి, సిద్దిపేట రచయితలు పుస్తకావిష్కరణలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు