Listen to this article

జనం న్యూస్ :ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో విర్బాక్ ( వేరిబిక్ అనిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ వారి ఆర్థిక సహాయంతో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విర్బాక్ కంపెనీసభ్యులు మాట్లాడుతూ మాకంపెనీ ద్వారా మొట్టమొదటిగా చెయ్యేరు శ్రీ పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే మరి కొంతమంది ముందుకు వస్తే ప్రతి హై స్కూల్ కి అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ విరబిక్ కంపెనీ వారి ఆర్థిక సాయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ కి వె రి బిక్ కంపెనీ వాటర్ ప్లాంట్ లు అందజేయాలని కోరుతూ చెయ్యరు హైస్కూల్లో మరికొన్ని అభివృద్ధి పనుల ప్రారంభిస్తామని అలాగే విద్యార్థులు అందరూ కూడా మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు దాట్ల పవన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెల్లి సురేష్, మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు త్సవటపల్లి నాగేంద్రరావు (నాగు), చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు త్సవటపల్లి శ్రీనివాసరావు, మాజీ వైస్ సర్పంచ్ త్సవటపల్లి నారాయణస్వామి( సీఎం) కాట్రేనికోన మండల తెలుగు రైతు అధ్యక్షులు సుధా రాఘవేంద్రరావు, సలాది నానాజీ, కాట్రేనికోన మండలం టిడిపి సీనియర్ యువ నాయకులు పి ఎస్ ఎన్ రాజు, రవి వర్మ, నడింపల్లి సూర్య వర్మ, గొల్ల కోటి దొరబాబు విద్యా కమిటీ చైర్మన్ పోలిశెట్టి వెంకట రాజు, వైస్ చైర్మన్ మోర్త శ్రీనివాస్ వర్మ, మంతెన శ్రీనివాసరాజు ,నంద్యాల వెంకటేశ్వరరావు, నంద్యాల చంటి నంద్యాల దొరబాబు, ఏడిద జోగయ్య, యనమదల సత్య బాలాజీ, మట్ట సూరిబాబు, సుంకర నాగేశ్వరరావు, కాయలు బలరాం విద్యార్థులు నామం వెర్రి బాబు ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.