ప్రభుత్వ కళాశాల విద్యార్థుల విజయాలతో పెరుగుతున్న ప్రభుత్వ విద్యా ప్రతిష్ట

May 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ; 18 మే సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన – ప్రభుత్వ ప్రణాళిక” ముగింపు కార్యక్రమాన్ని 11-05-2026 నుండి 17-05-2026 వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుండి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ విద్య బలోపేతానికి, అభివృధికి కృషి చేస్తున్నారని తెలిపారు.అదేవిధంగా సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎంపీసీ విభాగానికి చెందిన మోకు హారిక అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షల్లో 994 మార్కులు సాధించి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.1,00,000 నగదు బహుమతి అందుకోవడం సిద్దిపేట జిల్లాకి గర్వకారణమే కాకుండా ప్రభుత్వ కళాశాలల నాణ్యమైన విద్యకు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఎప్ సెట్, నీట్ జెఈఈ, వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను పెంచుతున్నారని తెలిపారు. నేటి ఎప్ సెట్ ఫలితాల్లో బాలికల కళాశాలకు చెందిన కార్తీక రెడ్డి 8801 ర్యాంక్ సాధించడం అభినందనీయమని చెప్పారు.ప్రతి విద్యార్థి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఫలితాలు సాధించాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన వివిధ కళాశాలల విద్యార్థులను మెమెంటోలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ళు అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper