Listen to this article

ముఖ్యఅతిథిగా హాజరైన 5వ వార్డ్ కౌన్సిలర్ వయార్థ సాగర్ బాబు

జనం న్యూస్- ఏప్రిల్ 18- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ 4 వ అంగన్వాడి సెంటర్ లో సూపర్వైజర్ గౌసియా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొండ మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ పయార్థ సాగర్ బాబు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పోషణ్ పక్వాడ 2026 పక్షోత్సవాలలో భాగంగా 4వ అంగన్వాడి సెంటర్ లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సూపర్వైజర్ తెలిపారు. మనిషి మెదడు అభివృద్ధిలో85 శాతం ఆరు సంవత్సరాల లోపే జరుగుతుందని అందుకే ఆ సమయంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రక్తహీనతను తగ్గించేందుకు చిరుధాన్యాల(మిల్లెట్స్) వినియోగంపై అవగాహన కల్పించారు. సాగర్ బాబు మాట్లాడుతూ పిల్లలను మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి ఆటపాటల ద్వారా వారిని విద్యావంతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జి శారదా దేవి, ప్రియాంక, రాజేశ్వరి, ఉమా, సుదర్శనమ్మ ఆయా సుజాత, అంగన్వాడి స్కూల్ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు గర్భిణీలు, బాలింతలు తదితరులు హాజరయ్యారు.