జనాభా గణనను బాధ్యతాయుతంగా చేపట్టాలి
తహసీల్దార్ సరిత
(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )
2026, 2027 సంవత్సరంలో రెండు దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన సర్వే సందర్భంగా శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మండల వ్యాప్తంగా జనగణన సర్వే నిర్వహించనున్న సర్వే బృందానికి నేటి నుండి ఆరు రోజులు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ సరిత ప్రారంభించారు.దీనిలో భాగంగా మొదటి విడత శిక్షణ శిబిరానికి 45 మంది హాజరు కాగా, రెండవ విడత శిక్షణ శిబిరం బుధవారం నుండి ప్రారంభం కానున్నదని,రెండవ విడత శిక్షణా శిబిరానికి 44 మంది హాజరుకానున్నారని తహసిల్దార్ తెలిపారు.జనాభా గణన ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, ఆర్ ఐ రామారావు,శిక్షణ (ట్రైనర్స్) ఎన్ కోటేశ్వరరావు, ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.


