జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోనే పేరు పొందిన చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అరవపల్లి వెంకట సురేష్ కుమార్ కి ట్రస్టు ఆధ్వర్యంలో సాయి భారత్ వైద్య సేవ సామ్రాట్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారమును ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి ప్రజలకు ఎన్నో సేవలు నిర్వహిస్తున్న డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్ అభినందనీయులని , ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు ఆస్పత్రికి వచ్చిన పేద లను అతి తక్కువ ఫీజుతో ఆదుకుంటూ అద్భుతమైన వైద్యాన్ని పిల్లలకి అందిస్తూ నియోజకవర్గంలోనే పేరుగాంచారని తెలియజేశారు, అనంతరం సురేష్ కుమార్ మాట్లాడుతూ జయ జయ సాయి ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అన్నసంతర్పణ కార్యక్రమం చేస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని, పలువురు ప్రముఖులను గుర్తించి వారికి తగిన పురస్కారాలు అందిస్తున్నారని వారికి నా అభినందనలు అని తెలియజేశా రూ, ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ పుర ప్రముఖులు అభినందించారు మాజీ మార్కెట్ యాడ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, కొత్తూరు హనుమంతరావు మానేపల్లి సుధాకర్ తదితర ట్రస్ట్ సభ్యులతో పాటు, శికాకొల్లి వెంకట రఘునాధ కిషోర్ , మేళ్లచెరువు పవన్ కుమార్, కొప్పురావూరి రామకృష్ణ, మురారి శెట్టి రామకృష్ణ తదితర ప్రముఖులతో పాటు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు


