

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 14; పరిధిలో గల గంగులు నాచారం గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో టీబీ వ్యాధిపై అవగాహన నిర్వహించి టీబీ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి కళ్ళే నమూనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాములు మాట్లాడుతూ ఏన్కూరు మండలంలోని ప్రతి పంచాయతీని టీబీ ఫ్రీ పంచాయతీగా మార్చడం కోసం టీబీ నిర్మూలన విభాగంలోని టీబీ చికిత్స సూపర్వైజర్ వై.సురేష్, ల్యాబ్ సూపర్వైజర్ సంజీవ్ కుమార్, వైద్య సిబ్బంది సహకారంతో పనిచేస్తున్నారని తెలియజేశారు.గంగుల నాచారం గ్రామపంచాయతీని టీబీ ఫ్రీ పంచాయతీగా మార్చడం కోసం కృషి చేస్తున్నారని అందుకు ప్రజలు టీబీ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని టీబీ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు గురించి వివరించారు.టీబీ వ్యాధికి సంబంధించిన మందులు పరీక్షలు పూర్తి ఉచితంగా ప్రభుత్వ అందిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శివరాజు, ఏఎన్ఎం కమల, ఆశా కార్యకర్త రమణ పాల్గొన్నారు.