జనం న్యూస్, ఏప్రిల్ 20,అచ్యుతాపురం:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ కటింగ్, అన్నదానం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కూడా సీఎంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో మండలం ఎస్కేఆర్ ఫంక్షన్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర,ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్,రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావుల సమక్షంలో కేక్ కట్ చేసి నేతలు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



