Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం టి శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం హెచ్ ఎం టి శ్రీలత రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు మా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కృత్యాల ద్వారా బోధ నాభ్యసన డిజిటల్ తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే తగు బోధనోపకరణాలతో బోధన అభ్యాసం కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి ప్రత్యేక శిక్షణ నాణ్యమైన విలువలతో కూడిన విద్య నాణ్యమైన అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ బెల్ట్స్ ఆరోగ్యానికి భద్రత సంబంధించిన అవగాహన కార్యక్రమాలు సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు ఆటపాటల ఉంటాయని వివరించారు ప్రతి కుటుంబ యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని బోధించాలని తెలియజేశారు ఈ బడిబాట కార్యక్రమంలో ఎం ఇ ఓ గడ్డం బిక్షపతి ఉపాధ్యాయులు పి శంకర్ బాబు ఏ రంజిత్ కుమార్ కే రేణుక బి సుజాత టి ఉమా దేవి బి లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు….