

జనం న్యూస్ ఫిబ్రవరి 15; మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తాడువాయి గ్రామంలో నిర్వహించిన నీక్షయ్ శివిర్ శిబిరాన్ని రేపాల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ సందర్శించి మాట్లాడారు. టీబీ లక్షణాలు ఎడతెరపి లేని దగ్గు,జ్వరం,ఆయాసం, ఆకలి మందగించటం, బరువు కోల్పోవడం, వీటిలో ఒకటి, రెండు లక్షణాలు ఉన్నట్టయితే టిబి కేసులు గా అనుమానించి పరీక్షలో చేయించుకోవాలని ఒక వేళ నిర్ధారణ అయితే మందులు వాడి పూర్తిగా నిర్మిలించ వచ్చునని తెలిపారు.నిర్లక్ష్యం చేస్తే సంవత్సరంలో 15 నుండి 20 మందికి టిబి వ్యాధి అంటుకునే అవకాశం ఉన్నందున,ఈ వ్యాధి ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో పడుతున్న వారికి,60 సంవత్సరాల పైబడిన వారు, స్ట్రీట్ వెండర్స్, గతంలో టిబి మందులు వాడిన వారు, ఫ్యాక్టరీలో పనిచే వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య సిబ్బంది నీ సూచించారు.ఈ వంద రోజుల నిక్షయ శివర్ కార్యక్రమం భాగంగా జరుగుతుందని ప్రారంభ దశలో గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఆరు నెలలు పాటు మందులు వాడితే టిబి జబ్బు పూర్తిగా నయం అవుతుంది కావున సకాలంలో ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.44 మంది వద్ద నుండి తెమడ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది 44 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు,.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు,ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ వైష్ణవి, ఎస్ టి ఎస్ సుభాషిని, ఎస్ టి ఎస్ సైదులు ల్యాబ్ టెక్నీషియన్ ఫణిందర్, టిబినోడల్ పర్సన్ రామకృష్ణ,ఎన్ సి డి నోడల్ పర్సన్ లింగయ్య ఏఎన్ఎంలు సుచరిత, పావని, లలిత , మయూరి కలమ్మ ఆశ కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.