జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని తహరాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాల సందర్భంగా గ్రాడ్యువేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఫ్రీ స్కూల్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఇటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన హాజరై పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పుణ్యవతి మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని, గర్భిణీ స్త్రీల నుంచి పుట్టిన పిల్లల వరకు సరైన పోషణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం పిల్లలకు యూనిఫారాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, ఫ్రీ స్కూల్ ట్రైనర్ రిజ్వనా, హైస్కూల్ హెడ్ మాస్టర్ రమేష్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సదాకర్, చలి వాగు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి సెక్టార్ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు…


