Listen to this article

జనం న్యూస్ ;21 ఏప్రిల్ మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథల పోటీలలో సిద్దిపేటకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన కథ “అందరూ చేసిందే చేద్దాం” పర్యావరణ కథ జాతీయ స్థాయిలో ఉత్తమ కథగా ఎంపిక కావడం పట్ల సిద్దిపేట రచయితలు ఐతా చంద్రయ్య, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, కాల్వ రాజయ్య లు సత్కరించారు. ప్రక్రియ ఏదైనా సిద్ధిపేట సాహిత్యంకు స్థానం దక్కుతుందని, మే 4న హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ లో అవార్డు అందుకుంటున్న సందర్బంగా అనిశెట్టి సతీష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.