Listen to this article

జనం న్యూస్: ఏప్రిల్ 21 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్

నిడమనూరు అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ అంగన్వాడి బడిబాట కార్యక్రమం జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్భిణీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేయడం జరిగింది.పోషణ పక్వాడ సందర్భంగా పోషణకు సంబంధించిన మిల్లెట్స్ గురించి వారికి తెలియజేయడం జరిగింది. పోషకాహారం పిల్లల పెరుగుదల గర్భిణీ, బాలింతలో పోషకాహారం పై చిరుధాన్యాలు రాగులు,సజ్జలు,కొర్రలు , జొన్నలు తదితర వాటిలో పోషకాలు ఉంటాయని తెలియచేయడం జరిగింది.గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు నిత్యం ఆహారంలో ఆకుకూరలు పాలు,గుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి . పిల్లల మెదడు అభివృద్ధికి పౌష్టికాహారం అవసరమని ఈ పోషణ పక్వాడ కార్యక్రమంలో వచ్చినటువంటి తల్లిదండ్రులకు లబ్ధిదారులకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఆర్ బీ స్ కే పూర్ణచంద్రరావు మరియు అంగన్వాడీ టీచర్స్ జిల్లా రాజేశ్వరి వహీదా పద్మజ అలివేలు పద్మ ఝాన్సీ గర్భిణీ స్త్రీలు,బాలింతలు చిన్నారులు పాల్గొన్నారు.