Listen to this article

సంగారెడ్డి .జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్

జహీరాబాద్, ఏప్రిల్ 21: పద్మశాలి వంశ మూల పురుషుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశగా కొలువబడే శ్రీ భావనా ఋషి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు స్థానిక మార్కండేశ్వర మందిరంలో భావనా ఋషి వేడుక్షలు అట్టహాసంగా జరిగాయి. వస్త్ర ప్రదాత, పద్మశాలీల ఆరాధ్య దైవమైన భద్రావతి భావనా ఋషి జన్మదినo పురస్కరించుకొని శ్రీ భక్త మార్కండేశ్వర మందిరంలో పండాల్ కృష్ణ సుప్రియ దంపతులద్వారా వేద పండితులైన శ్రీ వేణు భట్ గారి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ రుద్రాభిషేక కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్ధన్ , ప్రధాన కార్యదర్శి పద్మ రమేష్ బాబు,కోశాధికారి రంగా అరుణ్ కుమార్, సంఘం సభ్యులు కనుకుంట్ల నర్సింహులు , పండాల ప్రభు ,దోమల పండరి ,గద్దె వెంకటేశం,సగ్గo విజయ్ కుమార్ ,గడ్డం పాండు, కొంశెట్టిపల్లి లక్ష్మణ్ ,సగ్గo చంద్రశేఖర్ ,పoడాల ప్రభు ,దారా మధు, ఎన్నంరఘు, గూడ జగన్ లతో పాటు కుల బాంధవులు పద్మశాలి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు పద్మశాలి సంఘం తీర్థ ప్రసాదాలను వితరణ చేసింది.