Listen to this article

ఈ నెల 23న సీఎం చంద్రబాబు రాక

జనం న్యూస్, ఏప్రిల్ 21,అచ్యుతాపురం:

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో ‘రెన్యూ’ పారిశ్రామిక ప్రాజెక్టుకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్బంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలో రెన్యూ (Renew) సంస్థ ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు స్థానిక యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, జిల్లా ఏస్పీ తుహిన్ సిన్హా , జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లలతో కలసి అధికారులతో సమీక్షించారు.. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.