

జనం న్యూస్ ఫిబ్రవరి 14 చిలిపిచాడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా : చిలిపి చెడు మండలంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సరోజినీ నాయుడు జన్మదినం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలలో ఘనంగా ఆంగ్ల భాష దినోత్సవం జరుపుకోవడం జరిగింది .ఆంగ్లభాష దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఘనంగా ఆంగ్లభాష దినోత్సవం జరపడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి విటల్ పాల్గొనడం జరిగింది ఈ దినోత్సవం సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ నిత్యజీవితంలో ఆంగ్లం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగిందిఅదేవిధంగా మండలంలోని ఆంగ్ల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఆటల ద్వారా, కొత్త బోధన ఉపకరణాల ఉపయోగించి విద్యార్థులకు బోధన చేయడం ద్వారా విద్యార్థులు సంతోషంగా ఎన్నో విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది .మండలంలో వివిధ పాఠశాల సందర్శించినప్పుడు ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్న ఐ యాఫ్ పి లాంటి బోధనోపకరణాల ఉపయోగించి బోధన చేయడం చాలా బాగుంది అని ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది .అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బాగా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించడం జరిగింది . పదవ తరగతి అంతర్గత మార్కులను కూడా పరిశీలించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు సుధారాణి విద్యార్థులచే వివిధ రకాలైనటువంటి కృత్యాలు చేయించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు సుధారాణి ,ఉపాధ్యాయులు అజయ్ కుమార్, మహేష్ ,యాద గౌడ్, మోహన్ విజయ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ పాల్గొన్నారు