

ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామంలో పిడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నాయని సమాచారం రాగా వెంటనే ఎస్సై ప్రవీణ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ విటల్ కానిస్టేబుల్ రాజు హోంగార్డ్ వీరస్వామి అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా సూరారం గ్రామ చర్చి పక్కకు దాదాపు 31 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యం బస్తాలు ఉండగా ఇట్టి బస్తాల ప్రక్కనే నర్రావుల ఆంజనేయులు సన్నాఫ్ మల్లయ్య వయసు 25 సంవత్సరాలు వృత్తి గంగిరెద్దుల గ్రామం కొప్పూర్ మండలం భీమదేవరపల్లి అనునతడు ప్రజల వద్ద నుండి పది రూపాయల కిలో చొప్పున పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి వాటిని తిరిగి కిలో 16 రూపాయలు చొప్పున కోళ్ల ఫారాలకు అమ్ముతాడని తెలుపగా నర్రావుల ఆంజనేయులుపై ఎస్ఐ గారు కేసు నమోదు చేసినారు