Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 , ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం, పల్లంకుర్రు గ్రామంలో పి.ఏ.సి.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా భావిస్తూ కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని వేరుగా కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా, తమ పంటను నేరుగా ప్రభుత్వానికి అమ్ముకునే విధంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇకపై రైతులు తమ ధాన్యాన్ని సరైన ధరకు, పారదర్శకంగా అమ్ముకునే అవకాశాన్ని ఈ కేంద్రం కల్పిస్తుందని, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి సందేహాలు లేకుండా, స్వేచ్ఛగా తమ పంటను ఈ కేంద్రాల ద్వారా విక్రయించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, అధ్యక్షులు చెల్లి సురేష్, మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగిడి నాగేశ్వరావు, పల్లంకుర్రు బాబు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కాశి శ్రీనివాసరావు, కాట్రేనికోన మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బడుగు పుల్లారావు, కాట్రేనికోన మండల ఆర్గనైసింగ్ సెక్రటరీ మండల గెడ్డం చంద్రశేఖర్, పల్లంకుర్రు నీటి సంఘం అధ్యక్షులు కాసుకపట్ల వెంకటరమణ, మండల మహిళా అధ్యక్షురాలు మెల్లం సువర్ణ జ్యోతి, మాజీ సర్పంచ్ ఇసుకపట్ల అమ్మాజీ రాంబాబు, పల్లంకుర్రు సొసైటీ చైర్ పర్సన్ మంతెన సూర్య భాస్కర రాజు, పల్లంకుర్రు సొసైటీ డైరెక్టర్ వాకపల్లి అప్పారావు, జగడం కృష్ణమూర్తి, అమర సాయి, కసిరెడ్డి రాజా, ఇసుకపట్ల సురేష్, వాకపల్లి ఆనంద్, అయితాబత్తుల శ్రీను, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, అభిమానులు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..