Listen to this article

జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) మెదక్ కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ఎల్కతుర్తి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన బిజెపి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి కరీంనగర్ పార్లమెంటు ప్రబారి బోయినపల్లి ప్రవీణ్ రావు. హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి పాల్గొని. ఎమ్మెల్సీ ఎన్నికలకు చేపట్టవలసిన కార్యాచరణను గూర్చి దిశా నిర్దేశం చేయడం జరిగింది. మెదక్ కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ నియోజకవర్గ బిజెపి బలపరిచిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి అభ్యర్థించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముస్కే వెంకటేష్ యాదవ్, జనగాని కృష్ణయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, పల్లెపాటి మధుకర్, నాంపల్లి అశోక్, ఎర్రోళ్ల రాజు, చేదురాల వెంకటేష్, వీరమల్ల కృష్ణారెడ్డి, అల్లి కుమార్, కోరే కార్తిక్, కోడెం రమేష్, ఎర్ర గొల్ల రాజు, వంగ రమేష్, గడ్డం మధుకర్ రెడ్డి, రాకేష్, నరేష్, కొలిపాక శ్రీను, సిద్దు, వినయ్, వేల్పుల శ్రీను, కిరణ్, బొక్కలపాటీ కుమార్, మన్తుర్తి తిరుపతి, పోలు శివ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు