జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అంతర్వేది దేవస్థానం గ్రామంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ కార్యాలయంలో బుధవారం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస్ నగేష్ విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోదీ పై జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కర్కే చేసిన “టెర్రరిస్ట్” వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దేశ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానిపై ఇలాంటి అసభ్య, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకత్వం దిగజారుడు వ్యాఖ్యలని నగేష్ ఆగ్రహం వ్యక్తపరిచారు.ప్రధాని మోదీ దేశ భద్రత, అభివృద్ధి, పరిపాలనలో బలమైన నాయకత్వం చూపిస్తున్న తరుణంలో, ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల మధ్య ఉన్న విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తాయని అన్నారు.ఖర్గే వ్యాఖ్యలు కేవలం ప్రధాని నీ మాత్రమే కాదు, దేశ ప్రజాస్వామ్య విలువలను కూడా అవమానించే విధంగా ఉన్నాయి. తర్వాత ఆయన వివరణ ఇచ్చినా, ఈ రకమైన భాషను ఉపయోగించడం కాంగ్రెస్ పార్టీ మానసిక స్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టెర్రరిజాన్ని దేశంలో చిటికెన వేళ్ళతో పికిలించిన ఘనత మోడీకే దక్కుతుందని గర్విస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో మండల బిజెపి అధ్యక్షులు పోతురాజు సురేష్, ఉపాధ్యక్షులు ఉద్ద రాజు రామకృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి పోతురాజు నాగరాజు పాల్గొన్నారు.


