జనం న్యూస్ 23 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం పేట మాదారం గ్రామానికి చెందిన మంచన్ పల్లి అనంతయ్య కుమారుడు మహేష్(23) అనే యువకుడు బుధవారం ఉదయం తన పంటకు నీళ్లు పార పెట్టేందుకు పొలానికి వెళ్ళాడు. మోటరు ఆన్ చేయగా నీళ్లు రాకపోవడంతో సాటర్ వైర్ల సమస్య ఉందనుకొని వాటిని ఇప్పి పరిశీలించి మళ్లీ ఫిట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.



