Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-04-26

నందలూరు మండలం లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి నందలి స్థానిక బచ్చు భవన్ లో ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కర్ రావు చేతులు మీదుగా ” ఒక యోగి ఆత్మకథ”పుస్తకం ఆవి ష్కరణ చేయటం జరిగింది.ఈ సందర్బంగా పుస్తక పఠనం తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా యని, విలువైన జ్ఞానం సమ కూర్చుకొని అభివృద్ధి కి బాటలు వేసుకోవచ్చని ఐతే డిజిటల్ వ్యవస్థ తో పుస్తకాలు చదవడం తగ్గిందని ఇది కొంత ప్రమాద కరమైన, వ్యవస్థ కు ఇబ్బంది కలిగే పరిణామం కావున ప్రతీ ఒక్కరూ వయస్సు తో పనిలే కుండా మంచి పుస్త కాలు చద వాలని డాక్టర్ బచ్చు. జయ భాస్కర్ రావు తెలిపారు అనం తరం ఎస్ ఐ మన్నెం. రామ మోహన్ ప్రపంచ పుస్తక దినో త్సవ శుభాకాంక్షలు తెలు పుతూ.పుస్తకాలు విజ్ఞాన భాండా గారాలు అని పుస్తకాలు చదవ టం ద్వారా విలువల తో కూడిన జ్ఞాన సంపద సొంతం చేసుకొని ఎదగాలని ఇందుకోసం కుటుం బాలు అజ్ఞానాన్ని తొలగించు కుని వ్యక్తిత్వాన్ని,మాన వీయ విలువలను పెంపొందించు కోవాలంటే మంచి పుస్తకాలు చదవడం ఒకటే మార్గమని ఇవాళ ఇన్స్పిరేషన్ పొందగలిగే ” ఒక యోగి ఆత్మకథ” పుస్తకాన్ని ఆవిష్క రించడం జరిగిందని తెలియ జేశారు అలాగే ఇవాళ భగీరథ జయంతి సందర్భంగా వాకర్స్ క్లబ్ తరఫున నివాళు లర్పిం చారు.ఈ కార్యక్రమంలో భూ శెట్టి. వెంకటసుబ్బయ్య ( నీటి సంఘం అధ్యక్షులు ), మోడపోతుల రాము, గంధం గంగాధర్, మంటి మారయ్య, పాలకుర్తి వెంకటయ్య, పొన బోయిన. శ్రీకాంత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.