

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్,మార్టూరు రోడ్డు,అచ్యుతాపురం సెంటర్,సాయి ప్రియా లే అవుట్ ప్రాంతాల్లో 15వ తేదీ అనగా శనివారం ఉదయం10 గంటలు నుంచి సాయంత్రం 5గంటలు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్వినియోగ దారులు సహకరించాలని కోరారు.