జహీరాబాద్ జనం న్యూస్, ఏప్రిల్ 23, 2026
పట్టణంలోని దత్తగిరి కాలనీలో గల సగర సంఘం కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సగర సంఘం అధ్యక్షుడు శ్మాడురి వేణుగోపాల్ సాగర్ అధ్యక్షత వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పూజ కార్యక్రమంలో సగర కులానికి చెందిన పెద్దలు, యువత పాల్గొన్నారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భగీరథ మహర్షి గంగాను భూమికి తీసుకువచ్చిన గొప్ప త్యాగం, పట్టుదల గురించి వివరించారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కార్యదర్శి ఉప్పరి శంకర్ సగర, కోశాధికారి దేవేందర్ సగర, యువజన అధ్యక్షుడు రాజు సగర, కార్యదర్శి జగన్, ఉపాధ్యక్షులు మర్కా పాండురంగం సగర, రవి సగర, శంకర్ సగర, జగన్నాధం సగర, సిద్దు, వెంకటేశం,నర్సింహులు సగర ,కృష్ణ సాగర, ప్రభు సగర, ఎం . ప్రభూ, విష్ణు వర్ధన్, రాజు సగర, అశోక్ సగర, తుకన్న సగర, శివ సగర ఈ కార్యక్రమంలో పాల్గొని, సమాజ సేవకు కట్టుబడి ఉంటామని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం కూడా అధికారికంగా భగీరథ మహర్షీ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ మరియు మండల పరిషత్ కార్యాలయం లో నిర్వహించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.చివరగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.



