Listen to this article

చిలిపిచేడ్ మండల విద్యాధికారి విట్టల్

జనం న్యూస్ ఏప్రిల్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం సోమక్కపేట గ్రామంలోవిద్యార్థులకు ఉపాధ్యాయులకు తగు సూచనలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నేటితో ముగియనుంది. రేపటి నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయని మండల విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఆయన ఈ క్రింది సూచనలు చేయడం జరిగింది ​వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయట తిరగవద్దు. తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంగా ఉండాలి.
​సెలవుల్లో కేవలం ఆటలకే పరిమితం కాకుండా, రోజుకు కనీసం రెండు గంటల సమయం చదువుకు కేటాయించాలి. గత ఏడాది నేర్చుకున్న అంశాలను గుర్తుచేసుకోవాలి.​కథల పుస్తకాలు చదవడం, చేతిరాత మెరుగుపరుచుకోవడం మరియు కొత్త నైపుణ్యాలను (చిత్రలేఖనం, సంగీతం వంటివి) నేర్చుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.​ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన వేసవి బ్రిడ్జి కోర్స్ లాంటి అంశాలను తల్లిదండ్రుల మొబైల్ కు పంపి వాటిని పూర్తి చేసే విధంగా ఉపాధ్యాయులు చూడాలి .
​విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ రిజిస్టర్లు, విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు మరియు ఇతర రికార్డులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.​వచ్చే విద్యా సంవత్సరం నాటికి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్పించేందుకు (Enrolment Drive) అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
​అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ ఎల్ ఎన్ లో మంచి పురోగతి సాధించినందుకు ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది .పదవ తరగతిలో విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారని తెలియజేశారు