మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్
జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్ నమోదు అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ గారి అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం విర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారు చేయడానికి ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన ఎస్ ఐ ఆర్( SIR )కు రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువత, ప్రజలు సహకరించాలన్నారు. బి ఎల్ ఓ (BLO) లు ఎవరివి అయితే మ్యాపింగ్ కాలేదో వారి పేర్ల వివరాలతో ప్రతి గ్రామంలో సర్వే చేయడం జరుగుతుంది గ్రామం లోని సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్తాం కావున ప్రతి ఒక్కరూ ఎస్ ఐ ఆర్ (SIR )మ్యాపింగ్ చేయించుకోవాలని, రాజకీయ పార్టీలు కూడా చేయించాలని అన్నారు.మే మొదటి వారం లోపు ఎస్ ఐ ఆర్( SIR) పూర్తి చేయాలని నియోజక వర్గ తహశీల్దార్లకు ఆదేశించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తుకారాం, లక్ష్మణ్, తులసీరాం, అజయ్ తమ్మేవార్ మరియు నియోజక వర్గ తహశీల్దార్లు ఎం డి ముజీబ్, మహేందర్, లత, మారుతి, సాయి భుజంగరావు, వేణు గోపాల్, రంజిత్ కుమార్, రవి కాంత్, నాయబ్ తహశీల్దార్లు హేమలత, శివ రామకృష్ణ, గిర్దావర్ శంకర్, ఎన్నికల విభాగం అధికారులు రవి కుమార్, ప్రవీణ్, దశరథ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.



