Listen to this article

మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ గురువారం మద్నూర్ మండలం పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల బాలుర నందు జనగణన ఎన్యూమరేటర్ లకు రెండో బ్యాచ్ కు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ జనగణన లో పాల్గొనడం గొప్ప అవకాశం అని, ఎంతో అనుభవాన్ని నేర్పుతుందని అన్నారు. సక్రమంగా, శ్రద్ధగా జనగణన చేయాలన్నారు. ప్రజలకు జనగణన, స్వీయ గణన పై సోషల్ మీడియా వేదిక పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గణన – స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడం కోసం పౌరులు తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సొంతంగా మొబైల్ లేదా కంప్యూటర్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది అన్నారు. https://se.census.gov.in
పై పోర్టల్ (లింక్ ద్వారా) ఈ నెల 26వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు అన్నారు. అనంతరం ఎన్యూమరేటర్లకు జనగణన కిట్ బ్యాగ్ లను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఏ ఎస్ ఓ( ASO) దత్తు, సీనియర్ అసిస్టెంట్ మురళీధర్, శివకాంత్, శివరామ్ , రవి మరియు ఎన్యూమరేటర్ లు పాల్గొన్నారు.